English | Telugu
ఆంధ్ర ప్రదేశ్ లో అర్చకులకు రూ.5,000 ప్రభుత్వ సాయం
Updated : Apr 9, 2020
లాక్‌డౌన్ కారణంగా దేవాలయాలలోకి భక్తులను అనుమతించడం లేదు. ప్రస్తుతం అర్చకులు మాత్రమే ఏకాంతంగా నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో చిన్న దేవాలయాలలో ఎలాంటి ఆదాయ వనరులు లేని కారణంగా అర్చకుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ధూప దీప నైవేద్యం, అర్చక వెల్ఫేర్ ఫండ్ ద్వారా 2,800 మందికి పైగా అర్చకులకు ప్రతి నెలా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతుంది. ఈ రెండు పథకాలూ వర్తించని వారు రాష్ట్ర వ్యాప్తంగా 2,500 మంది దాకా పలు ఆలయాల్లో పనిచేస్తున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అర్చక వెల్ఫేర్ ఫండ్ ద్వారా ఒక్కొక్కరికి రూ. 5000 గ్రాంటు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయం కారణంగా అర్చక సంక్షేమ నిధిపై సుమారు ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల భారం పడనుంది.