English | Telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

తెలంగాణాలో కరోనా వ్యాప్తి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా జనగామ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. శుక్రవారం అస్వస్థకు గురైన అయనను హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అక్కడ డాక్టర్లు పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. కొద్దీ రాజుల క్రితం మాజీ ఎమ్మెల్యే, అయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ రాగా కార్పోరేట్ హాస్పిటల్ లో చేరి ట్రీట్ మెంట్ తీసుకున్న తరువాత కోలుకుని ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రం లో ఒక ప్రజా ప్రతినిధికి కరోనా సోకడం ఇదే ప్రధమం.

సిద్దపేటకు చెందిన మంత్రి హరీష్ రావు పిఎ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మంత్రికి కూడా పరీక్ష చేయగా కరోనా నెగటివ్ వచ్చింది. ఐతే కరోనా నెగటివ్ వచ్చినా కూడా హరీష్ రావు హైదరాబాద్ లోని తన ఇంట్లో హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. హైదరాబాద్, సిద్దిపేట లోని అయన ఆఫీసు సిబ్బంది 32 మందికి కి పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా హైదరాబాద్ నగర మేయర్ రామ్మోహన్ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ రావడం తో మేయర్ కు రెండో సారి పరీక్ష చేశారు.. ఇంకా రిజల్ట్ రావలసి ఉండటం తో నగర్ మేయర్ తో పాటు పలు పర్యటనలలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసి కమిషనర్, పలువురు కార్పొరేటర్లు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయం లో హైదరాబాద్ నగరం లో కరోనా వ్యాప్తి తీవ్రంగానే ఉంది. మలక్ పేట లోని ఆస్మాన్ గఢ్ ప్రాంతం లో నివసిస్తున్న ఎపి సెక్రటేరియట్ ఉద్యోగి, భార్య, పిల్లలకు కరోనా పాజిటివ్ గా తేలింది. నిన్న తెలంగాణాలో 164 కొత్త కరోనా కేసులు నమోదు కాగా అందులో 133 కేసులు జీహెచ్ఎంసి పరిధిలోనే నమోదయ్యాయి.