భారత్‌లో రోజుకి 9 వేలు, 10 వేలు నమోదవుతున్న కరోనా కేసులు ఇప్పుడు 11 వేల మార్క్ ను కూడా దాటాయి. గత 24 గంటల్లో దేశంలో 11,458 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనాతో 386 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,08,993కి చేరగా, మృతుల సంఖ్య 8,884కి చేరుకుంది. ఇప్పటివరకు 1,54,330 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 1,45,779 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.