English | Telugu
భారత్ లో 18 కోట్ల మందికి కరోనా సోకింది.. ప్రముఖ సంస్థ షాకింగ్ రిపోర్ట్
Updated : Jul 22, 2020
ప్రఖ్యాత డయాగ్నస్టిక్స్ సంస్థ అయిన థైరో కేర్ ల్యాబ్స్ దేశవ్యాప్తంగా 600 పిన్‌కోడ్స్‌లో సుమారు 60వేల మంది పై యాంటి బాడీ పరీక్షలు చేసింది. ఇందులో యావరేజ్ గా 15 శాతం మంది ప్రజల లో యాంటీ బాడీలు కనిపించాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. మన శరీరంలో కరోనా వైరస్ ప్రవేశిస్తే.. దాన్ని ఎదుర్కొనేందుకు యాంటీ బాడీలు తయారవుతాయి. దీని ఆధారంగా టెస్టులో యాంటీబాడీలు కనిపించాయంటే వారికి కరోనా సోకినట్లేనని నిపుణులు చెబుతున్నారు. మన దేశం మొత్తంగా 15 శాతం అంటే దాదాపు 18 కోట్ల మందికి కరోనా సోకి ఉంటుందని థైరో కేర్ సర్వే తెలిపింది. ఐతే దీనికి 3 శాతం అటూ ఇటూగా వాస్తవ పరిస్థితులు ఉండవచ్చని ఆ సర్వే వెల్లడించింది.
ఇదే సర్వేలో హైదరాబాద్‌లోని వివిధ పిన్ కోడ్లలో పరిస్థితి ఈ విధంగా ఉంది. 500002,500060,500036,500026 పిన్‌కోడ్ కలిగిన ప్రాంతాల్లో వరుసగా 37.3 శాతం, 30.6శాతం, 23.5శాతం, 23.3 శాతం మందిలో యాంటీ బాడీలు కనిపించాయని ఆ సంస్థ సర్వే రిపోర్టులో పేర్కొన్నారు.