English | Telugu

మూగబోయిన బాలల హక్కుల గొంతుక

కరోనాతో కన్నుమూసిన పి. అచ్యుత రావు

స్వేచ్ఛగా, ఆనందంగా పెరగాల్సిన బాలలకు ఎక్కడ సమస్య వచ్చినా.. వారి హక్కులకు ఆటంకం కలిగినా ఆయన గొంతుక అక్కడ వినిపించేది. యాదాద్రిలో చిన్నారుల అక్రమ నిర్భందం, నల్లగొండలో చిన్నారుల అమ్మకం ఇలా ఎక్కడ బాల్యం బజారున పడితే అక్కడ తన స్వరం వినిపిస్తూ న్యాయం జరిగేలా పోరాడే వ్యక్తి అచ్యుత రావు. బాలల హక్కుల సంఘం అధ్యక్షుడిగా దశాబ్దాలుగా పోరాటం చేసిన ఆయన కరోనా చేతిలో ఓడిపోయారు. కొన్నిరోజులుగా కోవిద్ 19 వైరస్ తో ఫైట్ చేసి అలసిపోయి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.

చిన్నారుల అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు ఇలా ఎన్నో అంశాలపై ఆయన కోర్టుల్లో కేసులు వేసి చిన్నారుల బాల్యం బందీ కావద్దని వాదించారు. అనేక న్యూస్ చానెల్స్ లో బాలల హక్కులపై అవగాహన కల్పించారు. ఆయన మృతి పట్ట పౌరసంఘాలు, బాలల హక్కుల కోసం పనిచేసే స్వచ్చంధ సంస్థలు తీవ్ర దిగ్భాంతిని తెలిపాయి.