English | Telugu
పంద్రాగస్ట్ కు ఖైదీల విడుదల
Updated : Jul 22, 2020
ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పోలీసు శాఖను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన జాబితాను రూపొందించాలని సూచించారు. ప్రగతి భవన్ లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, డిజిపి మహేందర్ రెడ్డి తదితరులతో ఈ అంశంపై చర్చించారు. ఖైదీల విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను పరిశీలించారు విడుదలకు అర్హులైన ఖైదీల జాబితా తయారు చేయాలని సిఎం సంబంధిత అధికారులను ఆదేశించారు.