English | Telugu

భారత్‌ లో 16 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 55,079 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో 779 మంది కరోనా కారణంగా మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,38,871కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 35,747కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 10,57,806 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 5,45,318 యాక్టివ్ కేసులు ఉన్నాయి.