English | Telugu
భారత దేశం మొత్తం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం మొదలైంది. మొట్టమొదటిగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన సిబ్బంది, ఆ తరువాత ఈవీఎంలను తెరిచారు.
ఏపీలో ఫేక్ ఆధార్ కార్డు తయారు చేస్తున్న ముఠా అరెస్టు తీవ్ర కలకలం రేపుతోంది. ఆధార్ కార్డులలో టాంపరింగ్ ద్వారా ప్రభుత్వ పథకాల్లో అనర్హులకు లబ్ధి చేకూర్చే విధంగా ఒక ముఠా పనిచేస్తున్నట్లు పోలీసులు తాజాగా గుర్తించారు.
ఏపీలో ఓ మహిళా వాలంటీర్ ఆత్మహత్యయత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి చెందిన పి. గన్నవరం ఎమ్మెల్యే అవమానించారని పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది.
మెగాస్టార్ చిరంజీవి త్వరలో ఆచార్య షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టే ఉద్దేశంతో.. టెస్ట్ చేయించుకోగా తనకు కరోనా సోకిందని, అయితే తనకు ఎటువంటి లక్షణాలు లేవని తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకడంపై స్పందించారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. కరోనా అంశంపై తెలంగాణ ప్రభుత్వానికి అనేక ప్రకటనలు ఉచితంగా చేసిన చిరంజీవి గారు ఇప్పుడు తానే కరోనా బారినపడడం దురదృష్టకరం అని ఆయన ట్వీట్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. కేసీఆర్ ను ఒక నియంతగా ఆయన అభివర్ణించారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై సంచలన కామెంట్లు చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. గ్రేటర్లో వరద సాయం పేరుతో వందల కోట్ల రూపాయలు స్వాహా చేశారని ఆరోపించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాక ముందే.. మహా గట్ బంధన్ ఎన్నికల సారథి, ఆర్జేడీ యువ నేత తేజస్వి యాదవ్ క్రేజీ అమాంతం పెరిగిపోయింది. బిహార్ లో ఆర్జేడీ కూటమిదే అధికారమని దాదాపు అన్ని సర్వేలు తేల్చి చెప్పడంతో..
22 ఏండ్లు.. ఐదు పార్టీలు.. ఒకసారి ఎంపీ పదవి. ఇవీ తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండుగా పిలుచుకునే విజయశాంతి అలియాస్ రాములమ్మ రాజకీయ చరిత్రను సూచించే లెక్కలు.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటి దీనిపై లోతుగా అధ్యయనం చేస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోయినా ఏపీలో ఏర్పడబోయే జిల్లాలపై జోరుగా ప్రచారం జరుగుతోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ పై సోషల్ మీడియాలో సెటైర్లు ఓ రెంజ్ లో పేలుతున్నాయి. ఆయనతో ఆటాడుకుంటున్నారు నెటిజన్లు.
పశ్చిమ బెంగాల్లో అధికార తృణామూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య వార్ ముదురుతోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కత్తులు దూరుతున్నాయి రెండు పార్టీలు.
ఆ ఇద్దరు యువ నేతలు. ఒకరు మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పాలనలో చక్రం తిప్పుతున్నారు. మరొకరు రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకులుగా ఉంటున్నారు.
తిరుమలలో ఆదివారం సాయంత్రం ఓ భక్తుడి కిడ్నాప్ కలకలం రేపింది. అయితే, కుటుంబీకుల సమాచారంతో.. పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమై కిడ్నాపర్లను వెంటనే పట్టుకున్నారు.
తెలంగాణలో మహిళా ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షురాలిగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే పార్టీలో తగిన గుర్తింపు లేదని భావించిన ఆమె రాజీనామా చేసి...