English | Telugu
ట్రంప్ కు మున్సిపల్ అఫీసులో ఉద్యోగం! జెరూసలేమ్ అధికారుల కలకలం
Updated : Nov 9, 2020
అధ్యక్షుడిగా ఉద్యోగం పోయినందుకు బాధ పడవద్దని, తమ సంస్థలో ఉద్యోగం ఇస్తామంటూ ట్రంప్ ను ఉద్దేశించి జెరూసలేమ్ మునిసిపల్ అధికారులు తమ అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఇది వైరల్ కావడంతో వెంటనే దాన్ని ఉన్నతాధికారులు తొలగించారు. ఈ పోస్ట్ అనుకోకుండా వచ్చిందని జెరూసలేమ్ మున్సిపల్ అధికార ప్రతినిధి ఒకరు వివరణ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ కు ఉద్యోగం ఇచ్చేందుకు తాము సిద్ధమంటే, తాము సిద్ధమని ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు కూడా ప్రకటిస్తున్నాయి.