English | Telugu
లోకేష్ పారిపోయాడు.. కేటీఆర్ జులాయి! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Updated : Nov 9, 2020
జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పైనా రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. వరద సాయం వివరాలు అడిగితే చెప్పలేక లోకేష్ కుమార్ పారిపోయారన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర పోలీసులను పెట్టి దొంగలా తప్పించుకున్నాడని రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. శనివారం నాడే కమిషనర్ లోకేష్ అపాయింట్మెంట్ తీసుకున్నా.. ఆయన ఎందుకు ఆఫీసుకు రాలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వరదలతో తీవ్ర ఇబ్బందులు పడిన బాధితులకు ఆదుకోకుండా గులాబీ నేతలకు కమిషనర్ డబ్బులు ఇస్తున్నారని మండిపడ్డారు.
వరద సాయంలో జరిగిన అవతకవకలకు నిరసనగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. వరద బాధితులతో కలిసి రేవంత్ నిరసనకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు లోపలికివెళ్లకుండా వందలాది మంది పోలీసులను అక్కడ మోహరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. వరద బాధితుల కోసం ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి.. అందులో 250 కోట్ల రూపాయలు గులాబీ నేతలే ఆరోపించారు.