English | Telugu

బీజేపీ లో చేరనున్న విజయ శాంతి!

తెలంగాణలో మహిళా ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షురాలిగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే పార్టీలో తగిన గుర్తింపు లేదని భావించిన ఆమె రాజీనామా చేసి, బీజేపీ లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయం కండువా కప్పుకోనున్నారని సమాచారం. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. జేపీ నడ్డా అపాయింట్‌మెంట్‌ కోరారని, ఈనెల 20న నడ్డా సమక్షంలో రాములమ్మ బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.