English | Telugu

మెగాస్టార్ కు కరోనా... ప్రగతి భవన్ లో అందరికి టెస్టులు

మెగాస్టార్ చిరంజీవి త్వరలో ఆచార్య షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టే ఉద్దేశంతో.. టెస్ట్ చేయించుకోగా త‌న‌కు క‌రోనా సోకింద‌ని, అయితే త‌న‌కు ఎటువంటి లక్షణాలు లేవని తెలిపారు. దీంతో గత కొద్దీ రోజులుగా త‌న‌ను క‌లిసిన అంద‌రూ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. తాజాగా ఇదే విషయం ప్రగతి భవన్ లో కలకలం రేగింది. ఎందుకంటే చిరంజీవి, మరో టాలీవుడ్ హీరో నాగార్జున తో కలిసి సీఎం కేసీఆర్ ను కలిసి వరద సహాయ నిధికి విరాళం ఇచ్చారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ తో పాటు పలువురు అధికారులతో చాలాసేపు సమావేశమయ్యారు. ఈ సమయంలో పాల్గొన్న వారెవరు మాస్కులు కూడా పెట్టుకోలేదు. తాజాగా చిరంజీవికి కరోనా సోకినట్లుగా తేలడంతో ప్రగతి భవన్ లో కలకలం రేగింది. దీంతో వెంటనే ప్రగతి భవన్ లోని వారందరికీ కరోనా రాపిడ్ టెస్టులు చేయించినట్లుగా తెలుస్తోంది. ఈ టెస్టులో ఎంపీ సంతోష్ కు నెగెటివ్ రాగా మ‌రికొంద‌రి రిపోర్టులు రావాల్సి ఉంద‌ని స‌మాచారం. అయితే…వారంతా చిరంజీవితో క‌లిసి కేవ‌లం రెండు రోజులు మాత్ర‌మే కాడంతో ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో మాత్ర‌మే క‌రోనా ఉన్నది లేనిది నిర్ధారణ అయ్యే అవ‌కాశం ఉంటుంద‌న్న నిపుణులు చెపుతున్నారు.