Brahmamudi: దొరికిపోయిన గజదొంగ ఛార్లెస్.. కావ్యకి రాజ్ ప్రపోజ్ చేయగలడా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి (Brahmamudi)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-734లో.. అప్పు, కళ్యాణ్ ల శోభనం గదిని డెకరేట్ చేసిన రాజ్, కావ్య ఇద్దరు అదే గదిలో ఉంటారు. అప్పు, కళ్యాణ్ ఇద్దరు కలిసి ఛార్లెస్ అనే దొంగ కోసం బయటకు వెళ్తారు. అదే సమయంలో ధాన్యలక్ష్మికి డౌట్ వచ్చి అప్పు, కళ్యాణ్ ల గది దగ్గరికి వెళ్తుంది. ఇక రాజ్, కావ్య తెలివిగా ఆలోచించి.. వారి మొబైల్ ఫోన్ లో ఆల్రెడీ రికార్డ్ చేసిన అప్పు, కళ్యాణ్ ల వాయిస్ రికార్డింగ్స్ ని ప్లే చేస్తారు. అది విని ధాన్యలక్ష్మి ఇద్దరు గదిలోనే ఉన్నారని కన్ఫమ్ చేసుకుంటుంది.