English | Telugu
Bigg Boss 9 Telugu winner : బిగ్ బాస్ సీజన్-9 విజేత పవన్ కళ్యాణ్.. రన్నరప్ గా తనూజ!
Updated : Dec 15, 2025
బిగ్ బాస్ సీజన్-9 ముగియడానికి చివరి వారం మిగిలి ఉంది. హౌస్ లో నిన్నటి ఎపిసోడ్ లో భరణి ఎలిమినేషన్ అయ్యాడు. గత వారం హౌస్ లో ఏడుగురు హౌస్ మేట్స్ ఉండగా.. సుమన్ శెట్టి, భరణి ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ లో ఇప్పుడు అయిదుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.
ప్రతీ సీజన్ లో లాగే ఈ సీజన్ కూడా టాప్-5 ఉంటారని బిగ్ బాస్ మామ కన్ఫమ్ చేశాడు. డీమాన్ పవన్, తనూజ, పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజన ప్రస్తుతం హౌస్ లో ఉన్నారు. ఇక నిన్న అర్థరాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ లో ఉన్నాయి. ఎవరు మీ ఫెవరెట్ కంటెస్టెంటో వారికి ఓట్ వేసుకోమని బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు. ఇక నిన్న మొదలైన ఓటింగ్ పోల్ రసవత్తరంగా సాగుతోంది.
అన్ అఫీషియల్ ఓటింగ్ పోల్ లో.. పవన్ కళ్యాణ్ పడాలకి అత్తధిక ఓటింగ్ నమోదవ్వగా.. సంజనకి లీస్ట్ ఓటింగ్ పడింది. 45.69 శాతం ఓటింగ్ తో పవన్ కళ్యాణ్ పడాల మొదటి స్థానంలో ఉండగా, 27.92 శాతం లో ఓటింగ్ తో తనూజ రెండో స్థానంలో ఉంది. 11.84 శాతం ఓటింగ్ తో ఇమ్మాన్యుయేల్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక లీస్ట్ లో సంజన, డీమాన్ పవన్ ఉన్నారు. 8.41 శాతం ఓటింగ్ తో డీమాన్ పవన్ నాల్గవ స్థానంలో ఉన్నాడు. 6.14 శాతం ఓటింగ్ తో సంజన లీస్ట్ లో ఉంది.
ఇక ఓటింగ్ కి మరో నాలుగు రోజులు ఉంది. శుక్రవారం వరకు జరిగే ఓటింగ్ ప్రక్రియలో ఎవరికి అత్యధిక ఓటింగ్ వస్తుందో వారే బిగ్ బాస్ సీజన్-9 విజేత అవుతారు. ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ పోల్ అనాలిసిస్ ప్రకారం కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన పవన్ కళ్యాణ్ పడాల టాప్ లో ఉన్నాడు. అతడే ఈ సీజన్-9 విజేత అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయితే తనూజకి కూడా ఆ ఛాన్స్ ఉంది. ఎందుకంటే తనని బిగ్ బాస్ దత్తపుత్రిక అంటారు. అంటే తనకి సపోర్ట్ ఎక్కువగా ఉందని ఆడియన్స్ భావిస్తున్నారు కానీ కామన్ మ్యాన్ రావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. మరి టాప్-5 లో ఉన్నవారిలో ఎవరికి మీ ఓట్ కామెంట్ చేయండి.