English | Telugu

Bharani Remuneration: భరణి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బిగ్ బాస్ సీజన్-9 నిన్నటితో పద్నాలుగు వారాలు పూర్తయింది. ఇక ఈ సీజన్ ముగియడానికి మరో వారం మిగిలి ఉంది. ఇక నిన్నటి సండే ఎపిసోడ్ భరణి హౌస్ నుండి ఎలిమినేషన్ అయ్యాడు. హౌస్ లో రేలంగి మామయ్యలాగా అందరితో మంచిగా మాట్లాడుతూ ఎవరినీ నొప్పించకుండా గేమ్ ఆడాడు భరణి. తను హౌస్ కి పెద్దదిక్కులాగా ఉన్నాడు. అయితే నాలుగు వారాల క్రితం భరణి ఎలిమినేషన్ అయ్యాడు. కానీ అనూహ్యంగా రీఎంట్రీ ఇచ్చాడు. హౌస్ నుండి బయటకు వెళ్ళేముందు వరకు బాండింగ్ తో ఉన్న భరణి.. మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాక దివ్య, తనూజలకి కాస్త దూరంగా ఉన్నాడు.

ఇక హౌస్ నుండి బయటకు వచ్చిన భరణికి భారీ రెమ్యునరేషన్ అందింది. వారానికి మూడు లక్షల అయిదు వేల పైగానే భరణికి బిగ్ బాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ఆరో వారమే ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఆరు వారాలకు గాను ఇరవై లక్షలకు పైగానే రెమ్యునరేషన్ అందింది. భరణి ఎనిమిదవ వారంలో హౌస్ లో రీఎంట్రీ ఇచ్చి మళ్లీ మరో ఆరువారాల పాటు కొనసాగాడు. దీంతో అదే లెక్కన మరో ఇరవై లక్షలు భరణి అందుకున్నట్టు తెలుస్తోంది.

మొత్తంగా చూస్తే నలభై రెండు లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. భరణి హౌస్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలిచాడు. అయితే ఫినాలే వీక్ కి మరో వారం ఉండగా ఎలిమినేషన్ అవ్వడం ఆడియన్స్ కాస్త నిరాశని మిగిల్చింది. హౌస్ లో భరణి ఎలిమినేషన్ మీకెలా అనిపించిందో కామెంటో చేయండి.