English | Telugu

Bharani Buzz interview: బజ్ ఇంటర్వ్యూలో తనూజ మీద షాకింగ్ కామెంట్స్ చేసిన భరణి!

బిగ్ బాస్ సీజన్-9 క్లైమాక్స్ కి వచ్చేసింది. ఇక పద్నాలుగో వారం వీకెండ్ లో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. శనివారం నాటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వగా ఆదివారం నాటి ఎపిసోడ లో భరణి ఎలిమినేట్ అయ్యాడు. ఇక హౌస్ నుండి ఎలిమినేషన్ అయిన భరణి ఎమోషనల్ అయ్యాడు. ఇక ఎలిమినేషన్ అయ్యాక శివాజీతో బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు భరణి.

బిగ్ బాస్ హౌస్ లో ఎవరికైనా ఒక్కసారే ఛాన్స్ వస్తుంది కానీ మీకు రెండుసార్లు వచ్చింది. ఎందుకు సద్వినియోగం చేసుకోలేదని శివాజీ అడుగగా.. నేను బాగానే ఆడాను కానీ నా కన్నా మిగిలిన అయిదుగురు బాగా ఆడారు అని నేను అనుకుంటున్నానని భరణి సమాధానమిచ్చాడు. మెడిసిన్స్ దాచిపెట్టినప్పుడు పర్లేదు అని అన్నారు కానీ తర్వాత నామినేషన్ చేశారని శివాజీ అడుగగా.. మెడిసిన్ దాచేసి ఫన్ అంటే ఎలా.. అది ఏమైనా ఫన్ ఆ అంటూ సంజన మీద భరణి సీరియస్ అయ్యాడు. రీఎంట్రీ తర్వాత దివ్యని దూరం పెట్టారు.

ఎందుకని శివాజీ అడుగగా.. నా వల్ల తన గేమ్ డిస్టబ్ అవుతది అని ఎంత దూరం పెట్టినా అది అవ్వలేదని గేమ్ అనేది మైండ్ తో ఆడాలి.. నా హార్ట్ నా మైండ్ ని డామినేట్ చేసిందని భరణి అన్నాడు. తనూజ తన గేమ్ తను ఆడుకుందని మీకెప్పుడైనా అనిపించిందా అని శివాజీ అడుగగా.. కొన్ని సందర్భాలలో అలా‌ అనిపించిందని భరణి అన్నాడు. అవన్నీ ఇప్పుడు మాట్లాడాలో లేదో తెలియదు కానీ ఐ వాంట్ టూ టాక్ అని భరణి అన్నాడు.


బజ్ ఇంటర్వ్యూ ప్రోమో యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఒక్క రోజులోనే మూడు లక్షల పై చిలుకు వ్యూస్ వచ్చాయి. ఇక దానికి ఫుల్ కామెంట్లు వచ్చాయి. ఆటలో మీరు గెలవకపోవచ్చు కానీ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా ఎప్పుడో గెలిచారు భరణి గారు అని ఒకరు కామెంట్ చేయగా.. భరణి గారికి కప్ అనేది చాలా చిన్న విషయం.. ఆయన వ్యక్తిత్వానికి మంచి మనసుకి నిజాయితీకి అందరి గుండెల్లో నిలిచిపోయారు.. లయన్ అని మరొకరు కామెంట్ చేసారు. హౌస్ లోనే కాదు బయట కూడా భరణికి పాజిటివిటి ఎక్కువగా ఉంది. మరి భరణి హౌస్ లో టాప్-5 కి డిజర్వ్ అవునా కాదా కామెంట్ చేయండి.