English | Telugu

Brahmamudi : భార్యని డిన్నర్ కి తీసుకెళ్ళిన భర్త.. ‌అక్కడ రౌడీలతో గొడవ!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -878 లో.. రాజ్ లవ్ లెటర్ లో మొత్తం ఆఫీస్ గురించి రాస్తాడు. ఇక సుభాష్ అయితే అపర్ణని వంటిల్లుకి పరిమితం చేస్తాడు. ఇక మిగిలింది ప్రకాష్.... చిన్న మావయ్య గారు ఎలా రాశాడో చదవండి అత్తయ్య అని ధాన్యలక్ష్మితో కావ్య అంటుంది. ప్రకాష్ మిగతా ఇద్దరి కంటే లవ్ లెటర్ బాగా రాస్తాడు కానీ చివర్లో ధాన్యలక్ష్మి పేరు కాకుండా లత అనే పేరు రాస్తాడు. ఈ లత ఎవరు అని ధాన్యలక్ష్మికి కోపం వచ్చి ప్రకాష్ వెంట పరుగెడుతుంది. దాంతో అందరూ నవ్వుకుంటారు.

ఏడాదిలో రెండు సీజన్స్ ...అదే చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే 

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే ప్రాజెక్ట్ కే సీజన్ 5 నవంబర్ 20 నుంచి స్టార్ట్ కాబోతోంది. ఆ షో గ్లిమ్ప్స్ ని రీసెంట్ గా రిలీజ్ చేసిన ఆహా. ఇక హోస్ట్ గా సుమ కనకాల వచ్చింది. ఇక రుచి చూసి మార్క్స్ వేసే నటుడు, చెఫ్ జీవన్ కుమార్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. "ఆడియన్స్ కోరిక మేరకు ఒకే సంవత్సరంలో రెండు సీజన్స్ ని మొదలుపెట్టినటువంటి ఏకైక షో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే" అని చెప్పింది సుమ. ప్రతీ గురువారం ఒక న్యూ ఎపిసోడ్ ని ప్రసారం చేయబోతోంది ఆహా. "మళ్ళీ ఆడియన్స్ కోసం వంటగది రెడీ ఐపోయింది. కొంచెం గందరగోళంతో బోల్డంత కామెడీతో మీకు తెలిసిన వాళ్లంతా చెఫ్స్ గా రాబోతున్నారు. వారి వంటల స్కిల్స్ చూసి మీరు కచ్చితంగా షాకవ్వాల్సిందే.

రష్మికకి హ్యాపీ మారీడ్ లైఫ్ అని చెప్పిన గీతూ రాయల్

బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ సోషల్ మీడియాలో మోటివేషనల్ వీడియోస్ చేస్తూ ఫుల్ ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ రివ్యూస్ కూడా చెప్తూ ఉంటుంది. అలాంటి గీతూ రీసెంట్ గా గర్ల్ ఫ్రెండ్ మూవీ హీరోయిన్ రష్మిక బైట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. అందులో ఏముందంటే "గర్ల్ ఫ్రెండ్" మూవీ సక్సెస్ మీట్ లో మీరు ఎం చెప్పారు అంటే ప్రతీ ఒక్కరి లైఫ్ లో విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తి ఉండాలి అని చెప్పారు. మరి మీ లైఫ్ లో విజయ్ దేవరకొండ ఏంటి" అని గీతూ రాయల్ అడిగింది. "అతను నా బెస్ట్ ఫ్రెండ్" అని రష్మిక మందన్నా చెప్పింది. వెంటనే గీతూ రాయల్ "హ్యాపీ మారీడ్ లైఫ్ బెస్ట్ ఫ్రెండ్" అని విషెస్ చెప్పింది. "మీరు అసలు ఎం మాట్లాడుతున్నారో నాకేం అర్ధం కావడం లేదు" అని చెప్పింది రష్మిక. ఆ కామెంట్ కి ఓకే అని చెప్పింది గీతూ.

Jayam serial : శకుంతలతో పైడిరాజు సవాల్.. గంగకి పెళ్లి చేస్తాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -112 లో.. గంగ కట్టుకున్న చీరని పారు కాల్చేస్తుంది. అప్పుడే పైడిరాజు తాగి రుద్ర ఇంటికి వస్తాడు. తనని ఆపడానికి లక్ష్మీ, గంగ వెంటే వస్తారు. పైడిరాజు గొడవ చేస్తాడు. దాంతో ఇంట్లో అందరు బయటకు వస్తారు. ఎవరు అతను అని ఇషికని పారు అడుగుతుంది. ఎందుకు వచ్చావని పైడిరాజుని శకుంతల అడుగుతుంది. నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నారని పైడిరాజు అంటాడు. ఏం మాట్లాడుతున్నావని శకుంతల కోప్పడుతుంది. గంగ గురించి శకుంతల తప్పుగా మాట్లాడుతుంది. రుద్ర కుటుంబం గురించి పైడిరాజు తప్పుగా మాట్లాడుతాడు..  అప్పుడే వీరు వచ్చి పైడిరాజుపై కోప్పడతాడు.