English | Telugu

Jayam serial: గంగ ఎప్పటికీ రాదని చెప్పిన రుద్ర.. పెద్దసారు ఏం చేయనున్నాడు?

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -141 లో... రుద్ర మాటలు గంగ గుర్తుచేసుకుంటుంది. మరొకవైపు లక్ష్మీ స్పృహలోకి వస్తుంది. అసలు ఏమైందని అడుగుతుంది. రుద్ర సర్ కి, నీకు గొడవ ఏంటని అడుగుతుంది. ఈ హాస్పిటల్ బిల్ ఎవరు కట్టారని లక్ష్మీ అడుగగా అవన్నీ నీకెందుకని శ్రీను వాళ్ళు అంటారు.

ఆ తర్వాత లక్ష్మీని డిశ్చార్జ్ చేసి ఆటోలో తీసుకొని వెళ్తుంటే అక్కడ పక్కన రుద్ర కార్ కన్పిస్తుంది. అది చూసి ఆగుతారు. రుద్ర సర్ కార్ ఇక్కడ ఉందేంటని అనుకుంటారు కానీ రుద్ర అందులో ఉండడు. నాకు తెలిసి సర్ వేరే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటాడని గంగ అంటుంది. గంగ నువ్వు, రుద్ర సర్ మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే మీ గొడవలు అన్నీ దూరం అవుతాయని శ్రీను, బంటి అంటారు.

ఆ తర్వాత రుద్ర, గంగ మాట్లాడుకుంటారు. నేను ఏ తప్పు చెయ్యలేదని రుద్రకి గంగ చెప్తుంది. చేయకుంటే ఆ వస్తువు నీ దగ్గర ఎందుకు ఉందని రుద్ర అడుగుతాడు. నేను ఏ తప్పు చెయ్యలేదు.. ఈ మంటపై ఒట్టు అని గంగ ఒట్టేస్తుంటే రుద్ర తన చేయి పక్కకి లాగుతాడు.

మరొకవైపు ఇంకా రుద్ర ఇంటికి రాలేదని ఇంట్లో వాళ్ళు ఎదురుచూస్తారు. శకుంతలతో పెద్దసారు మాట్లాడుతాడు. గంగ ఈ ఇంటికి రాదని రుద్ర ఫోన్ లో చెప్పాడని శకుంతల చెప్పగానే.. పెద్దవాళ్ళతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి కదా అని సీరియస్ అవుతాడు. అందరు రుద్ర కోసం ఎదురుచూస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.