English | Telugu
Karthika Deepam 2: కూతురికి పెళ్ళి అవ్వడం లేదని స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్న తల్లి!
Updated : Dec 14, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -540 లో... జ్యోత్స్నని పోలీసులు అరెస్ట్ చేసినట్లు పారిజాతం కల కంటుంది. వద్దు నా మనవరాలిని అరెస్ట్ చెయ్యకండి అని పారిజాతం అంటుంటే జ్యోత్స్న తనని లేపి ఏమైందని ఆడుగుతుంది. నిన్ను పోలీసులు అరెస్ట్ చేశారే అని అంటుంటే.. ఎప్పుడు అలాగే ఆలోచిస్తావా అని పారిజాతంపై జ్యోత్స్న కోప్పడుతుంది.
మరుసటిరోజు ఉదయం సుమిత్ర ఇంకా నిద్ర లేవకపోయేసరికి దశరథ్, సుమిత్రని లేపుతుంటే.. అసలు లేవదు. దాంతో భయపడి శివన్నారాయణకి చెప్తాడు. నాన్న సుమిత్ర లేవట్లేదని చెప్పడం జ్యోత్స్న విని.. పారిజాతం దగ్గరికి వెళ్లి గ్రానీ మమ్మీ చనిపోయిందని చెప్పగానే పారిజాతం షాక్ అవుతుంది.
అందరు కలిసి సుమిత్రని లేపుతారు. సుమిత్ర మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. హమ్మయ్య సుమిత్రకి ఏం కాలేదని పారిజాతం అంటుంది. ఏమైందని సుమిత్ర ని దశరథ్ అడుగుతాడు. నిద్ర పట్టడం లేదని స్లీపింగ్ టాబ్లెట్ వేసుకున్నానని సుమిత్ర చెప్తుంది. నిద్ర పట్టనంత ఏం టెన్షన్ ఉందని పారిజాతం అడుగుతుంది. పెళ్లికి ఎదిగిన కూతురు ఉంటే నిద్ర ఎలా పడుతుందని శివన్నారాయణ అంటాడు. ఏం టెన్షన్ జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుంది కదా అని పారిజాతం అనగానే జ్యోత్స్నకి జాతకాలు కలవక పెళ్లి ఫిక్స్ అవ్వడం లేదని శివన్నారాయణ చెప్తాడు. అది దశరథ్ చెప్పి ఉంటాడు. అందుకే సుమిత్రకి టెన్షన్ అని శివన్నారాయణ అంటాడు.
మరొకవైపు కావేరి ఇంటికి దీప, కార్తీక్ వస్తారు. వాళ్ల టిఫిన్ కి అన్ని ఏర్పాట్లు చేస్తారు. కాంచన రాలేదని తెలిసి శ్రీధర్ డిజప్పాయింట్ అవుతాడు. కాంచనకి శ్రీధర్ ఫోన్ చేసి మాట్లాడుతాడు. అప్పుడే ఒకతను టిఫిన్ తీసుకొని వచ్చి కాంచనకి ఇస్తాడు. నువ్వు రావని తెలిసి నేను పంపించానని కాంచనకి శ్రీధర్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.