Illu illalu pillalu : భాగ్యం, ఆనందరావుకి చుక్కలు చూపించారు.. వేదవతికి క్షమాపణ చెప్పిన రామరాజు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -234 లో... ఆనందరావు, భాగ్యం ఇంట్లోకి వచ్చాక.. అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళారు బాబాయ్ అని నర్మద అడుగుతుంది. ఈ ఇల్లు అనుకొని ఆ ఇంట్లోకి వెళ్ళానని ఆనందరావు చెప్తాడు. ఈ రోజు శ్రీవల్లి అక్క పుట్టినరోజు అంటున్నారు.. కనీసం గిఫ్ట్, కేక్ లేకుండా ఎలా సర్ ప్రైజ్ ఇద్దామనుకున్నారని నర్మద, ప్రేమ డౌట్ మీద డౌట్ అడుగుతారు.