English | Telugu

Jayam serial : కోటిరూపాయల కోసం కూతురికి పెళ్ళి చేస్తున్న పైడిరాజు.. రుద్ర ఏం చేస్తాడు!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -25 లో....గంగని కలవడానికి పెద్దసారు, వంశీ వస్తారు. వాళ్ళని అవమానించి పంపించండని ఇషిక తన మనిషికి చెప్తుంది. దాంతో రౌడీలు అందరు పెద్దసారుని చుట్టుముడతారు. ఎవరు మీరు అని పెద్దసారు అడుగుతాడు. అప్పుడే పైడిరాజు ఎంట్రీ ఇచ్చి మీరెందుకు వచ్చారు. ఈ రోజు మా గంగ పెళ్లి అనగానే పెద్దసారు షాక్ అవుతాడు.

అప్పుడే పెళ్లికొడుకు వచ్చి గంగని చేసుకోబోయేది నేనే అని అబ్బాయి వస్తాడు. నేను ఒకసారి గంగతో మాట్లాడుతానని పెద్దసారు అంటాడు. అయినా వినిపించుకోకుండా అటు ఇటు నెట్టేస్తారు. వంశీని కొడుతుంటే ఆపండి.. మేమ్ వెళ్ళిపోతామని పెద్దసారు రిక్వెస్ట్ చేస్తాడు. మంచిగా రిక్వెస్ట్ చెయ్యండి అని రౌడీలు అంటారు. దాంతో చేతులు జోడించి పెద్దసారు రిక్వెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత పెద్దసారు వంశీ ని తీసుకొని అక్కడ నుండి బయల్దేరతాడు. వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోగానే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళు కాదు‌.. నీ భార్య ఎప్పుడు మారేది తెలియదు.. ముందు తన సంగతి చూడమని పెళ్లికొడుకు పైడిరాజు తో అంటాడు. పైడిరాజు తన భార్యకి నిద్రమాత్రలు ఇస్తుంటే.. నువ్వు ఇంత ప్రేమ నటిస్తున్నావ్ దీని వళ్ల నా కూతురికి ఏమైనా అయితే నీ సంగతి చెప్తానని పైడిరాజుకి తన భార్య వార్నింగ్ ఇస్తుంది.

నాకు కోటి రూపాయలు వచ్చాక నిన్ను ఎవడు పట్టించుకుంటాడే అని పైడిరాజు అనుకుంటాడు. మరొకవైపు పెద్దసారు వంశీ ఇంటికి వస్తారు. ప్లాన్ సక్సెస్ అని ఇషిక, వీరు అనుకుంటారు. పెద్దసారు ఇంట్లోకి వెళ్ళాక గంగ గురించి అడుగుతారు. గంగకి ఈ రోజు పెళ్లి అని చెప్తాడు. అప్పుడే రుద్ర వస్తాడు. అక్కడ ఏం జరిగిందని అడుగుతాడు. ఏం లేదని పెద్దసారు అంటాడు. అయిన రుద్ర నమ్మడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.