English | Telugu

Bigboss 9 Telugu : బిగ్ బాస్ అగ్నిపరీక్ష జడ్జిగా అభిజిత్.. ఫ్యాన్స్ కి పండగే!

బిగ్ బాస్ అంటే క్రేజ్ ని తీసుకొచ్చింది ఎవరంటే అభిజిత్ అని చెప్తారు. సీజన్-4 లో తన ఆటతీరుతో ప్రేక్షకులకు దగ్గరై చివరికి విన్నర్ అయ్యాడు. అభిజిత్ బిగ్ బాస్ ని విడిచి దాదాపు అయిదేల్లవుతుంది. అభిజిత్ ఇప్పటివరకు ఎక్కడా కూడా బిగ్ బాస్ గురించి ప్రస్తావించలేదు. అయితే ఇన్నేళ్లు అయిన అభిజిత్ కి ఉండే క్రేజే వేరు.

బిగ్ బాస్ సీజన్-4 అయ్యాక పెద్దగా ఎక్కడ కన్పించలేదు. తన పాటికి తను టూర్స్ అంటూ ఎంజాయ్ చేస్తున్నాడు అభిజిత్. అగ్నిపరీక్షకి జడ్జిగా అభిజిత్ ని భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకొని వచ్చారట బిగ్ బాస్ టీమ్. అయితే అభిజిత్ తో పాటు బిందుమాధవి, నవదీప్ కూడా అగ్నిపరీక్షకి జడ్జులుగా ఉండగా.. శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించనుంది. అగ్నిపరీక్షలో కంటెస్టెంట్స్ కి అభిజిత్ కి మధ్య చిన్న వార్ జరిగిందని తెలుస్తోంది. దాంతో ఎప్పుడు కూల్ గా ఉండే అభిజిత్ ఒక కంటెస్టెంట్ తో గొడవపడటం ఏంటని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ గొడవని అగ్నిపరీక్ష ప్రోమోలో ఇస్తే మంచి హైప్ క్రియేట్ చేయోచ్చని బిగ్ బాస్ టీమ్ అనుకుంటుంది.

అభిజిత్ ని మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లో చూడబోతున్నందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అగ్నిపరీక్షలో కంటెస్టెంట్ సెలక్షన్ అనేది డిఫరెంట్ గా జరుగుతుంది. కొన్ని గ్రూప్ లాగా చేసి ఒక టాస్క్ ఇచ్చి.. ఎవరైతే ఎక్కువ యాక్టివ్ గా ఉంటారో వాళ్ళని ముందు లెవెల్ కి క్వాలిఫై చేస్తారట. అయితే ఈ సెలెక్షన్ లో ఎన్ని టాస్క్ లు ఉన్నాయో, ఎంతమంది కంటెస్టెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేశారో తెలియాలంటే బిగ్ బాస్ సీజన్‌-9 మొదలయ్యే వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.