Brahmamudi : ఇంటికి వారసుడిని ఇవ్వడం నా భాద్యత.. శుభవార్త చెప్పిన కావ్య!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -793 లో.... కావ్యకి రాజ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తుంది. రాజ్ వెళ్తుంటే ఇందిరాదేవి, అపర్ణ ఆపి మేం కావ్యకి నచ్చజెప్పుతాం.. నువ్వు టెన్షన్ పడకని అంటారు. వద్దు తనకి ఇష్టం లేదు.. ఇన్ని రోజులు నా హెల్ప్ తీసుకుంటే అది ప్రేమ అనుకుని భ్రమ పడ్డాను అంతే అని రాజ్ ఎమోషనల్ అవుతాడు. బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు.