English | Telugu
జబర్ధస్త్ సెట్‌లో ఊహించని ఘటన.... ఖుష్భూ మాస్ వార్నింగ్
Updated : Aug 12, 2025
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. నూకరాజు స్కిట్ లో రియాజ్, కొమరక్కా ఇంకో కమెడియన్ చేసాడు. ఐతే ఒక కమెడియన్ వచ్చి "ఎవడ్రా నా పెళ్ళానికి 500 లు ఇచ్చింది" అంటూ రియాజ్ ని దబాయిస్తూ ఉన్నాడు. ఇంతలో కొమరక్క వచ్చి "ఎవడ్రా నువ్వు నా మగోని మీద చెయ్యేశావంటూ" లాగి దవడ మీద ఒక్కటిచ్చింది. అంతే ఆ కమెడియన్ గిలగిలలాడిపోయాడు. దాంతో అందరూ షాకయ్యారు. అది కామెడీగ కాదు నిజంగా కొట్టినట్టుగా భావించారు. ఇక ఆ కమెడియన్ కూడా తిరిగి కొమరక్కను కొట్టాడు.
వీళ్ళ గొడవ చూసిన జడ్జ్ ఖుష్భూ మాత్రం వెంటనే సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. "అన్ని టీమ్స్ కి చెప్తున్నాను ఇంకోసారి ఎవరైనా ఇలా కొడితే ఇక్కడ మార్క్స్ అన్నీ మైనస్ చేస్తాను. కామెడీ అంటే ఇంకొకళ్ళు కొట్టడం కాదు. ఎవరూ ఎవరినీ కొట్టొద్దు. స్కిట్ మాత్రమే చెంపపెట్టులా ఉండాలి. ప్రతీ ఒక్కరూ లిమిట్ లో ఉండాలి." అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఇక నెటిజన్స్ కూడా ఈ విషయం మీద రియాక్ట్ అవుతున్నారు. "జబర్దస్త్ లో కామెడీ తక్కువైంది.. కొట్టుకోవడం ఎక్కువైంది .. ఖుష్బూ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు .. సూపర్... ఆ ఫైమకి చెప్పాలి అందరిని కొడుతుంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య స్కిట్స్ లో జోరుగా కొట్టుకోవడమే ఎక్కువగా కనిపిస్తోంది.. ఇక కృష్ణ భగవాన్ మాత్రం చూస్తూ ఉన్నారు కానీ ఏమీ మాట్లాడలేదు.