కూరగాయల మార్కెట్, కూకట్‌పల్లి ఫ్లైఓవర్ అదే తెలుసు నాకు అప్పటికి
ప్రశాంత్ బిగ్ బాస్ తర్వాత ఇంత గ్యాప్ తీసుకున్నావంటే ఏదో జరుగుతోంది ? అని అంది వర్ష. "అంతకు మించి" అని సిగ్గుపడుతూ సమాధానం ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. "మనతో పాటు పొలంలో పని చేసిన అంకుల్స్, ఆంటీలు కానీ ఒరేయ్ కోతి నా కొడకా ఇది ఇంకా ఆపవా" అని అడిగితే "ఆపము అది. అది అట్లే నడుస్తూ ఉంటుంది. "ఉన్నది చిన్న ఫోన్..అందులో వీడియోస్ చేస్తే బిగ్ బాస్ వరకు వెళ్తాను అని ఎలా అనిపించింది" అని అడిగింది వర్ష ." ఒక సారి బాపు దగ్గర ఒక పెద్దాయన వచ్చారు. నీ కొడుకు ఎం చేస్తున్నాడు అంటే పొలం కాడ పని చేస్తున్నాడు అని చెప్పాడు. ఆయన కొంచెం తీసిపారేసినట్టు మాట్లాడాడు..దాంతో నాకు బాధ అనిపించింది.