పెళ్లి మీద పెద్ద ఇంటరెస్ట్ లేదు...డ్రగ్స్ కేసులో జైల్లో వేస్తే చేసేదేముంది
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిట్ గా ఉండే విలన్ రోల్స్ కి పెట్టింది పేరు సుబ్బరాజు. తెలుగు, తమిళంలో కలిపి 50 చిత్రాలకు పైగా నటించాడు. కృష్ణవంశీ డైరెక్షన్ లో "ఖడ్గం" మూవీలో ఒక చిన్న పాత్ర చేసాడు, "అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి" మూవీలో కూడా నటించాడు. ఎంతో మంది టాప్ డైరెక్టర్స్ తో కలిసి పనిచేశాడు. బాహుబలి మూవీలో అనుష్క బావగా నటించి మెప్పించాడు.