English | Telugu

'ఏ మాస్టర్ పీస్' మూవీలో కనిపించి అలరించబోతున్న గుప్పెడంత మనసు జగతి మేడం!

గుప్పెడంత మనసు సీరియల్ స్టార్ మాలో ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. కార్తీకదీపం సీరియల్ ఐపోయాక టాప్ - 1 రేటింగ్ ని సంపాదించుకుంది ఈ సీరియల్. ఇందులో పాత్రలు కూడా చాలా పద్దతిగా కనిపిస్తాయి. అందులో ఇంకా డబుల్ పద్దతిగా కనిపిస్తుంది జగతి క్యారెక్టర్. లెక్చరర్ హోదాలో హుందాగా పొందిగ్గా ఉంటుంది. మరి ఆ జగతి పాత్ర చేసిన ఆమె పేరే జ్యోతి రాయ్. ఇంత స్టైలిష్ గా, స్మార్ట్ ఉండే ఈ టీచరమ్మ ఇప్పుడు "ఏ మాస్టర్ పీస్" మూవీలో కనిపించబోతున్నారు.

ఇక ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ అరకు ఒరిస్సా బోర్డర్ లో పూర్తయినట్లు ఆమె తన లుక్ తో ఉన్న ఒక పోస్టర్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. కార్తీకదీపంలో తల్లి పాత్రలో సౌందర్య ఎంత అందంగా అలరించి వెళ్లిపోయిందో ఇప్పుడు అలాగే జగతి కూడా అందమైన తల్లిగా మెప్పిస్తోంది. 1987 జూలై 4 న కర్ణాటకలో పుట్టిన జ్యోతి రాయ్ తన ఎడ్యుకేషన్ ని అక్కడే పూర్తి చేసింది. చిన్నప్పటినుంచి మూవీస్ మీద ఉన్న ఇంటరెస్ట్ తో యాక్టింగ్ వైపు అడుగులు వేసింది. కొన్ని కన్నడ సీరియల్స్, కన్నడ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

తెలుగులో నిరుపమ్ హీరోగా నటించిన 'కన్యాదానం' సీరియల్లో నటించింది. ఇక చాలా సంవత్సరాల తర్వాత తిరిగి 'గుప్పెడంత మనసు' సీరియల్ తో రిషికి తల్లిగా జగతి పాత్రలో అలరిస్తూ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. జ్యోతిరాయ్ పోజ్ కి నెటిజన్స్ అంతా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తూ బెస్ట్ విషెస్ చెప్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.