Read more!

English | Telugu

పెళ్లి మీద పెద్ద ఇంటరెస్ట్ లేదు...డ్రగ్స్ కేసులో జైల్లో వేస్తే చేసేదేముంది

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిట్ గా ఉండే విలన్ రోల్స్ కి పెట్టింది పేరు సుబ్బరాజు. తెలుగు, తమిళంలో కలిపి 50 చిత్రాలకు పైగా నటించాడు. కృష్ణవంశీ డైరెక్షన్ లో  "ఖడ్గం" మూవీలో ఒక చిన్న పాత్ర చేసాడు, "అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి" మూవీలో కూడా నటించాడు. ఎంతో మంది టాప్ డైరెక్టర్స్ తో కలిసి పనిచేశాడు. బాహుబలి మూవీలో అనుష్క బావగా నటించి మెప్పించాడు. 

లీడర్, గీత గోవిందం, కృష్ణార్జున యుద్ధం, టెంపర్, పవర్, దేశముదురు, పోకిరి, పౌర్ణమి, షాక్,  మహానది ఇలాంటి ఎన్నో మూవీస్ లో నటించాడు. ఇక ఇప్పుడు ఒక ఓపెన్ హార్ట్ ప్రోగ్రాంకి వచ్చి ఎన్నో విషయాలను చెప్పాడు. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. సుబ్బరాజు పుట్టింది భీమవరంలో. వాళ్ళ నాన్న ప్రభుత్వ టీచర్. సినీ ఇండస్ట్రీకి కావాల్సింది మంచి ఫిట్ గా ఉన్న బాడీ. అలాగే మెయింటైన్ చేస్తున్నా. బాడీ ఫిట్ గా లేకపోతే నాన్న, బాబాయ్ వంటి క్యారెక్టర్స్ వస్తాయని చెప్పాడు. అవకాశాలు ఇమ్మంటూ అడిగే అలవాటు తనకు లేదని చెప్పాడు. 

భీమవరం రాజులంటే రొయ్యలు, పీతలు, చేపలు, కోడి పందాలు, పేకాటలు ఉంటాయన్నారు. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఇప్పటి వరకు రాలేదని చెప్పాడు. డ్రగ్స్ విషయంలో తన పేరు ఎందుకు వచ్చిందో తెలీదు..దీని మీద తనను ప్రశ్నలు అడిగారని సమాధానాలు కూడా చెప్పానన్నారు.  వాళ్లకు తప్పనిపిస్తే జైల్లో వేస్తారు.. చేసేదేమీలేదు కదా అని చెప్పారు. ఇంకా ఏమేం చెప్పారో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి.