English | Telugu

అప్పుడు తిట్టుకున్నారు...ఇప్పుడు కలిసిపోయారు!


ఇదొక విశాల ప్రపంచం. ఎవరు కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ ఇక్కడే కలుసుకోవాల్సింది అనేది ఒక వేదాంతం. ఇక్కడ అలాంటి ఇద్దరు కమెడియన్స్ కూడా అలాగే కలిసిపోయారు. జబర్దస్త్ వేదికగా కెరీర్ స్టార్ట్ చేశారు కిర్రాక్ ఆర్పీ, హైపర్ ఆది. వీళ్ళు చాలా తక్కువ టైంలోనే మంచి ఫేమస్ అయ్యారు. అనివార్య కారణాల వలన ఆర్పీ జబర్దస్త్ నుంచి బయటకు రావడం ఆ షో గురించి అవాకులు, చవాకులు పేలడం వాటికి ఆది, రాంప్రసాద్ కౌంటర్లు వేయడం అందరికీ తెలిసిన విషయమే. ఆర్పీ ఎక్కడా సెట్ కాలేక చివరికి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఒక కర్రీ పాయింట్‌ ఓపెన్ చేశాడు.

బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తూనే సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేశాడు. ఈ బ్రాంచ్ ఓపెనింగ్ ఫంక్షన్ కి హైపర్ ఆది రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ బ్రాంచ్ ఓపెనింగ్ కి ఆర్పీ పట్నాయక్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, శాంతి, శివారెడ్డి వంటి జబర్దస్త్ కమెడియన్స్, మిమిక్రి ఆర్టిస్ట్స్ అంతా వచ్చారు. అప్పట్లో వాళ్ళ మధ్య కాస్త దూరం వచ్చిందన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఇద్దరూ ఇలా కనిపించడంపై వారి ఫ్యాన్స్ అంత ఫుల్ ఖుషీ ఐపోతున్నారు. ఆర్పీ ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేసాక కస్టమర్స్ తాకిడి తట్టుకోలేక కొన్నిరోజులు బిజినెస్ ఆపేసి నెల్లూరు వెళ్లి చేపల పులుసుని అదిరిపోయేలా వండేందుకు ఆడిషన్స్ పెట్టి బెస్ట్ చెఫ్ లేడీస్ ని ఒక టీమ్ గా ఏర్పాటు చేసి సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.