English | Telugu

లేస్తుందేంట్రా... కాపురానికి పనికి రాకుండా పోతావ్...

మిస్టర్ అండ్ మిస్సెస్ రియాలిటీ షో ప్రతీ వారం అలరిస్తూ ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది. ఇక ఈ ఫినాలేకి డైరెక్టర్ అనిల్ రావిపూడి గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. దీని ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ప్రోమో స్టార్టింగ్ లో జడ్జెస్ శివ బాలాజీ, హీరోయిన్ స్నేహ ఒక రొమాంటిక్ డ్యాన్స్ చేస్తూ స్నేహ చేతి మీద ముద్దు పెట్టాడు  శివ బాలాజీ దాంతో  "బాలాజీ ఆర్ యూ హ్యాపీ.." అని స్నేహ అడగడంతో "చాలా హ్యాపీ.." అంటూ చెప్తూనే తెగ సిగ్గుపడిపోయాడు. వెంటనే శ్రీముఖి "అప్పుడెప్పుడో ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు వచ్చారు  ..మళ్లీ ఈ ఫినాలేకి వస్తానని మాటిచ్చారు." అంటూ అనిల్ రావిపూడిని పిలిచింది స్టేజి మీదకు "మన ఎపిసోడ్స్ రెగ్యులర్‌గా ఎప్పుడైనా ఫాలో అయ్యారా?" అని రావిపూడిని శ్రీముఖి అడిగింది. దీనికి "కచ్చితంగా స్నేహ గారి కోసం ఫాలో అవుతాను" అని చెప్పారు. "ఐతే ఎవరి జడ్జిమెంట్ బాగా నచ్చింది.." అనగానే "స్నేహ గారే కరెక్టుగా మాట్లాడతారు." అని అనిల్ చెప్పేసరికి శివబాలాజీకి మండిపోయింది.  "మీరు మాత్రం చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు." అంటూ  కౌంటర్ వేసాడు. 

తను ప్రేమించిన అమ్మాయి అడ్రస్ తెలుసుకున్న గౌతమ్!

స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -99 లో.. కృష్ణ కాలేజీ కి రెడీ అయి సర్ నేను కాలేజీకి వెళ్తున్నా అని మురారికి చెప్పగానే.. నేను డ్రాప్ చేస్తానని మురారి అంటాడు. "లేదు సర్ నేను వెళ్ళగలను. మీరు ఇచ్చిన ధైర్యంతో వెళ్ళిరాగలను సర్" అని కృష్ణ చెప్పేసి వెళ్ళిపోతుంది. "ఏంటి మురారి నన్ను మర్చిపోయాడా? కృష్ణకి సపోర్ట్ చేస్తున్నాడు.. నేను ఇప్పటికి ఎప్పటికి నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నా ప్రేమ నీకు మాత్రమే.. ఆదర్శ్ వచ్చినా కూడా నీ మీదనే ప్రేమ పెంచుకుంటాను. ఇంతకు మురారి మనసులో నా స్థానం ఏంటో తెలుసుకోవాలి" అని ముకుంద అనుకుంటుంది.