English | Telugu

నువ్వక్కడ...నేనిక్కడ..అంటూ ఆన్లైన్లో యానివర్సరీని సెలెబ్రేట్ చేసుకున్న సుమ-రాజీవ్


తన స్పాంటేనియస్ యాంకరింగ్ తో ఎంతో మందిని అలరిస్తున్న హోస్ట్ సుమ కనకాల. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు విషయానికి వస్తే సుమ-రాజీవ్ కనకాల తమ 24వ పెళ్లి రోజును వెరైటీగా ఆన్లైన్ లో సెలెబ్రేట్ చేసుకున్నారు. వీళ్ళిద్దరూ ఒకే చోట లేకపోయేసరికి వీడియో కాల్ చేసుకుని ‘నువ్వక్కడ.. నేనిక్కడ.. పాటక్కడ.. పలుకక్కడా అంటూ సుమ ఒక చరణం పాడితే..." మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా" అంటూ రాజీవ్ కనకాల పాడారు. ఈ వీడియోని సుమ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.

ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో వాళ్లకున్న బిజీ షెడ్యూల్స్ లో మ్యారేజ్ డేని ఇలా ఒక పాట రూపంలో సెలెబ్రేట్ చేసుకోవడం వాళ్ళ అన్యోన్యతకు తార్కాణం. కొంత కాలం క్రితం ఈ జంట మీద సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చిన విషయం..దాని గురించిన వాళ్ళు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. సుమ ఎలాంటి షో చేస్తున్నా అందులో తప్పనిసరిగా ఏదో ఒక చోట రాజీవ్ పేరును తలచుకోకుండా ఉండదు. దేవదాస్ కనకాల డైరెక్ట్ చేసిన "మేఘమాల" సీరియల్ లో కలిసి నటించిన రాజీవ్ కనకాల-సుమ ఆ తర్వాత ప్రేమించుకుని పెద్దల సమక్షంలో 1999, ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకున్నారు. సుమ నేటివ్ కేరళ ఐనా కూడా తెలుగు భాష మాట్లాడితే చాలు తెలుగమ్మాయే అనిపించేలా ఉంటుంది.

తెలుగు మీద అంత గ్రిప్ తెచ్చుకుంది సుమ. స్టార్ హీరోలకు సంబంధించిన ఏ ఈవెంట్ , ఫంక్షన్, ప్రీ రిలీజ్ వేడుక ఏదైనా సరే ఆమె యాంకరింగ్ చేయాల్సిందే. ఇక నెటిజన్స్ ఈ జంటకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని విష్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.