English | Telugu

బ్రాంచ్ ఓపెనింగ్ లో కనిపించని సుధీర్...అసలు నిజం చెప్పిన శీను

కిర్రాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు సెకండ్ బ్రాంచ్ ని మణికొండలో రీసెంట్ గా ఓపెన్ చేసాడు. దీనికి ఒకప్పుడు గొడవలు పడిన జబర్దస్త్ కమెడియన్స్ అంతా వచ్చి అతన్ని విష్ చేశారు తర్వాత చేపల పులుసు తిని ఎంజాయ్ చేసారు. ఇదే టైంలో ఇక్కడికి వచ్చిన గెటప్ శీను ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు. " ఫస్ట్ బ్రాంచ్ కి ఎందుకు రాలేదు సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ కి ఎందుకు వచ్చాం అంటే రీజన్స్ లేవు అప్పుడు కుదరలేదు ఇప్పుడు కుదిరింది వచ్చాం.

ఇక్కడ చేపల పులుసు చాలా బాగుంది. నాకు ఎగ్ బూర్జి తినడం, చేపల పులుసు వండి పెట్టడం ఇష్టం. నెలలో ఏదో ఒక టైంలో ఇంట్లో నేనే కుక్ చేసి ఫ్రెండ్స్ కి , ఫామిలీ మెంబర్స్ కి తినిపిస్తూ ఉంటాను. ఇక ఇప్పుడు నేను చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా మణికొండలో అందరికీ నెల్లూరు చేపల పులుసు దొరుకుతుంది కాబట్టి. గత పదేళ్ల నుంచి కూడా నాకు ఫుడ్ బిజినెస్ పెట్టాలని కోరిక ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ వదిలేసి ఇటు రావాలి కానీ ప్రస్తుతం నా చేతిలో సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి అవి తగ్గినప్పుడు నేను ఈ ఫీల్డ్ గురించి ఆలోచిస్తాను. సుధీర్ ఎందుకు రాలేదో నాకు కూడా తెలియదు. ఎక్కడ ఉన్నాడో కూడా తెలీదు. మే బి కొత్త సినిమాకు సైన్ చేసాడు కాబట్టి ఆ వర్క్ షాప్స్ లో, షూటింగ్ లో బిజీగా ఉన్నాడేమో. రాజు యాదవ్ లో లిప్ లాక్ గురించి అడుగుతారేమిటి అందులో ఎమోషన్, లవ్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కదా..ఏప్రిల్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి చూస్తున్నాం.

త్వరలో సాంగ్స్, ట్రైలర్ తో పాటు ఒక డేట్ ని అనౌన్స్ చేయడానికి వస్తున్నాం. సుమ అడ్డా షోలో చిరు గారి ముందు వాల్తేర్ వీరయ్య స్పూఫ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది...కానీ ఆయన ముందు చేయాలంటే చాలా భయం. ఊపిరి తీసుకోలేనంత బిజీ ఐనప్పుడు మాత్రమే చూస్తా కానీ అప్పటివరకు నా వీలును, టైంని బట్టి జబర్దస్త్ చేస్తూనే ఉంటా" అని చెప్పాడు గెటప్ శీను.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.