English | Telugu

గేతో ఎలా ప్రెగ్నన్సీ వస్తుంది...కళ్ళు తెరిచి నిజం తెలుసుకోండి!

సెలెబ్రిటీస్ మీద ఎన్ని గాసిప్స్ వస్తే అంత ఫేమస్ అవుతూ ఉంటారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటారు. ఇక సోషల్ మీడియాలో వచ్చే వార్తలకు ఘాటుగా సమాధానాలిచ్చి కూడా ఫేమస్ అవుతూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు పునర్నవి కూడా అలాగే ట్రెండింగ్ టాపిక్ లోకి వచ్చేసింది. పున్ను అంటే చాలు బిగ్ బాస్ బ్యూటీగా అందరికీ గుర్తొచ్చేస్తుంది. హౌస్ లో ఉన్నన్ని రోజులు రాహుల్ సిప్లిగంజ్ తో చెట్టాపట్టాలేసుకుని కబుర్లు చెప్పింది. ఉయ్యాలా జంపాల మూవీలో కూడా నటించింది.

తర్వాత స్టడీస్ కోసం లండన్ వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళాక ఆమె ఒక అబ్బాయితో చాలా క్లోజ్ గా ఉన్న ఫొటోస్ ని షేర్ చేసేసరికి అతనితో రిలేషన్ లో ఉన్నట్లు భావించారంతా. అలాగే ఆమె పొట్ట కూడా కాస్త ఎత్తుగా కనిపించేసరికి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఈ విషయం మీద ఆమె రెస్పాండ్ అయ్యింది. మామూలు రూమర్స్ ఐతే ఎవరూ పట్టించుకునేది కాదేమో కానీ తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన న్యూస్ అయ్యేసరికి ఆమె చాలా సీరియస్ అయిపోయింది.

"నా గే బెస్టీ వల్ల నాకు గర్భం వచ్చిందని ఒక యూట్యూబ్ వార్త రాసింది. పోయిన నెలలో నేను అనారోగ్యంగా ఉన్న నేను ఈ నెలలో ప్రెగ్నెంట్ ఐపోయాను...లైమ్ లైట్‌లో మీరు చూసేదంతా నిజం కాదు. నిజం మూడు రకాలుగా ఉంటుంది. కళ్ళతో చూసేదే నిజం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నప్పటికీ స్త్రీలను అవమానించే సంస్కృతి బాగా పెరిగిపోతోంది." అంటూ గట్టిగా క్లాస్ ఇచ్చిపడేసింది. ఈ మొత్తాన్ని కూడా పున్ను తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.