English | Telugu

రిషి సర్ ని ఆశీర్వదించిన కమెడియన్స్ బ్రహ్మానందం, అలీ

"గుప్పెడంత మనసు" సీరియల్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. అందులో రిషి క్యారక్టర్ కి మస్త్ ఫాన్స్ కూడా ఉన్నారు. రిషి అలియాస్ ముఖేష్ గౌడ క్యారెక్టర్ ఈ సీరియల్ లో మంచి స్మార్ట్ గా, నీట్ గా హుందాగా ఉంటుంది. ఆయనకు చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉన్నారు. అలాంటి ఫాన్స్ లో స్టార్ కమెడియన్ బ్రహ్మానందం గారు కూడా ఒకరు. మరి అలాంటి బ్రహ్మానందం గారు , ఆలీ గారు స్వయంగా గుప్పెడంత మనసు బృందాన్ని చూడడానికి వెళ్లారు. రిషిని చక్కగా ఆశీర్వదించారు. "నువ్వు చాలా మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నావ్. మా ఆవిడకు మీ మొత్తం సీరియల్ టీంకి పెద్ద ఫ్యాన్. బాగుందమ్మా వసుధారా. మిమ్మల్నందరినీ ఇలా చాలా హ్యాపీగా ఉంది. రిషి చాలా బాగా చేస్తున్నావ్ నాన్న.

ఎంతో సంతోషంగా ఉంది. బేలెన్స్డ్ గా నటించడం చాలా కష్టమైన పని. కానీ రిషి చాలా చక్కగా చేస్తున్నాడు. నటన కొంచెం లో అయితే తగ్గిందని అంటారు కొంచెం ఎక్కువ చేస్తే ఓవర్ చేస్తున్నారంటారు. పాత్ర ఎంత చేయాలో అంతే చేస్తున్నావ్...గాడ్ బ్లెస్స్ యు. ఐ లవ్ యు డార్లింగ్." అని బ్రహ్మానందం గారు అనేసరికి రిషి సర్ కూడా ఫుల్ హ్యాపీ అయ్యారు. "అంత లెజెండరీ కమెడియన్స్ మమ్మల్ని చూడడానికి రావడం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది" అంటూ ఆ ఫొటోస్ ని వీడియోస్ ని ముఖేష్ గౌడ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నాడు. ఈ సీరియల్ యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్టైంది. హీరో రిషి పాత్రలో కన్నడ కుర్రాడు ముఖేష్ గౌడ అదరగొడుతున్నాడు. 2015లో మిస్టర్ కర్ణాటక టైటిల్ ను గెల్చుకున్నాక ‘నాగకన్నిక’ అనే సీరియల్‌తో డెబ్యూ హీరోగా ఆడియన్స్ ముందుకొచ్చాడు. ‘ప్రేమ నగర్’ సీరియల్‌తో తెలుగు ఇండస్ట్రీలోకి ముఖేష్ అడుగుపెట్టాడు. ఇప్పుడు ‘గుప్పెంత మనసు’ సీరియల్‌ తో మంచి బ్రేక్ వచ్చింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.