Read more!

English | Telugu

ఏం ప్రశ్నలురా బాబు అవి...అక్కా అంటూనే!

ఒకప్పుడు ఫాన్స్ తో టచ్ లో ఉండడం పెద్ద టాస్క్. కానీ సోషల్ మీడియా బాగా పెరిగాక ఆ టాస్క్ చాలా ఈజీ ఐపోయింది. చేతిలో సెల్లు ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ఉంటే చాలు ఫాన్స్ ఆటోమేటిక్ గా టచ్ లోకి వచ్చేస్తారు. 

ఇప్పుడు వెరైటీగా తన ఫాన్స్ తో చాట్ చేశారు బీబీ జోడి సత్య-మెహబూబ్. ఫాన్స్ అడిగిన ప్రశ్నలు చదవడం జవాబులు ఇవ్వడం మొత్తాన్ని వీడియో తీసి మెహబూబ్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. ఒక ఫ్యాన్ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కే మెహబూబ్ షాకయ్యాడు. "అన్నా నువ్వు వర్జినా ?"  అని అడిగేసరికి  " రేయ్.. ఏం క్వశ్చన్‌ రా అది" అని నవ్వుతూనే అరిచాడు. 

తర్వాత సత్యను ఓ నెటిజన్ " మీకు మెహబూబ్ ఇష్టమా ? అర్జున్ కల్యాణ్ అంటే ఇష్టమా" అని అడిగాడు. మరో ఫ్యాన్  "సత్య అక్క ! మీ ఫస్ట్ కిస్ ఎప్పుడు అయ్యింది" అని అడిగేసరికి గట్టిగానే ఇచ్చేసింది శ్రీసత్య.  "సో.. అక్క అని పిలిచి.. అక్కను ఇలాంటి ప్రశ్నలడుగుతావా నువ్వు" అంటూ సూటిగా అడిగేసింది. తర్వాత మెహబూబ్‌ను "మీకు శ్రీసత్యతో డ్యాన్స్ చేయడం ఇష్టమా? అషూతో చేయడం ఇష్టమా?" అని అడిగేసరికి మెహబూబ్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఒక పోజ్ పెట్టాడు తప్ప ఆన్సర్ చెప్పలేదు. " రొమాంటిక్ సాంగ్ మనోహరి చేసేటప్పుడు మీరిద్దరూ ఎలా ఫీలయ్యారు" అని మరో ఫ్యాన్ అడిగేసరికి మెహబూబ్ ఆన్సర్  "చింపేయాలి అంతే ఓకే నా" అన్నాడు. ఆ మాటకు శ్రీసత్య "చింపేస్తే ఎలా ? స్టేజ్‌పైన డ్రెస్" అంటూ ఫన్నీ కౌంటర్ వేసింది. తర్వాత వాళ్లకు ఎదురైన ప్రశ్న ఏమిటో తెలీదు కానీ  "నో ఫీమేల్ ఫ్రెండ్స్ మేటర్స్" అంటూ శ్రీసత్య ఫుల్ ఫైర్ ఐపోయింది. బీబీ జోడిలో శ్రీ సత్య-మెహబూబ్ అద్భుతంగా రొమాంటిక్ డ్యాన్సస్ తో అలరిస్తున్నారు.