చెత్తకుండీ గుండె పగిలిన వేళ - శారదా అశోకవర్ధన్

టపటప మని మబ్బుల పేగులు తెంచుకుని గాలి తాకిడికి రాలిన నీటి చుక్కలని చూసి రాని నిద్దురకోసం అలసటతో అల్లాడే పావని జోకొడితే బజ్జుంటుందేమోనన్న అమ్మ ఆశలా పుడమితల్లి పులకరిస్తూ ఒళ్ళు విరుచుకుని కళ్ళు పెద్దవి చేసి చూసింది పసిపాప బోసినవ్వులాగే హాయిగా నవ్వుకుంది!

Jan 16, 2012

ఏమో! - శారదా అశోకవర్ధన్

మానవుడా! మానవత్వాన్ని గుండెనిండా నింపుకుని దైవత్వం పొందిన సాధువులా జీవనాన్ని సాగించే మహామహుడా! జీవనయానంలో అలుపెరుగని ప్రయాణికుడా!

Jan 16, 2012

ఇప్పుడే తెలిసింది - శారదా అశోకవర్ధన్

అబలవూ ఆడపిల్లవూ అంటూ అందరూ నిన్ను అలుసుగచూసేవాళ్ళే పుట్టగానే పురిటి ఖర్చులూ నీకు పెట్టె ప్రతీ పైసా దండగని ఊహించుకుంటూ నిన్ను కనడం ఖర్మంటూ నీ తమ్ముడికోసం కలలు కంటూ నిన్ను ఆరడిపెడుతూ వుంటే నోరు విప్పని నన్ను చూస్తే

Jan 16, 2012

స్నేహ కృష్ణ - శారదా అశోకవర్ధన్

కాలేజీకెళ్ళే వారందరికీ ఆమె తెలుసు ఆమె చదువుల తల్లి కనుక - కవితలల్లే వాళ్ళందరికీ ఆమె పరిచయమే కవయిత్రి కనుక - సహృదయులందరికీ ఆమెతో నెయ్యమే స్నేహశీలి గనుక -

Jan 16, 2012

'ఆమె' - బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి

కవితలల్లాను కన్నీళ్ళమీద! అవి, మానవ జీవితాల్లో మొలిచి హృదయంలో పూచిన గడ్డిపూలు! 'అమ్మ' అంటే నీకు అర్థం కాలేదా? అయితే విను-

Jan 15, 2012

మనసా! తెలుసా? - వడ్డెపల్లి కృష్ణ

చీకు చింతలేని చిరుత వయసును దలువ చిత్తమే పులకించు మనసా! బ్రతుకులో బంగారు ప్రాయమ్ము బాల్యమ్ము స్మృతులుగా పలికించు తెలుసా?

Jan 15, 2012

ముగ్గురమ్మల మూలపుటమ్మ - శారదా అశోకవర్ధన్

నవమాసాలు మోసి ఎంతో ప్రయాసకోర్చి జన్మనిస్తుంది కన్నతల్లి పొత్తిళ్లలో పొదివి పట్టుకుని గుండెలకి హత్తుకుంటూ స్తన్యమిచ్చి పెంచుతుంది తన బలాన్ని క్షీరధారగా మర్చి గోరుముద్దలు తినిపిస్తుంది

Jan 13, 2012

నానీడవే అయినా - శారదా అశోకవర్ధన్

మేలుకొలుపకు నన్ను మేలు కొలుపకు నువ్వు కనుమూసి కలనైన తేలిపోనివ్వు.... ఉరుకు పరుగుల బతుకుబాటన అలసిపోయిన నన్ను అలుపు తీరేదాకా హాయిగా కాస్సేపు నిదుర పోనివ్వు...

Jan 13, 2012

ఆశావాది! - శారదా అశోకవర్ధన్

పిచ్చి కెరటం పరుగెడుతుంది కొండలకు ఢీకొట్టుకుంటూ ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా లెక్కజెయ్యక ప్రయాణం ఆపుకోక ఒడ్డు చేరుకోవాలన్న ఆశ తప్ప అలుపుతెలీని కష్టజీవి కెరటం వెన్నెలకు చూస్తూ వెర్రెత్తినట్టు

Jan 13, 2012

వినరా .... వినరా …. తెలుగోడా....! - శారదా అశోకవర్ధన్

అందుకో కాలాన్ని తెలుసుకో గతకాలపు వైభవాన్ని వేసుకో భావికి బాటలు బంగారు పీటలు - ఎమ్మన్నా ఏమున్నా నీ ఖ్యాతిని పెంచుకో

Jan 13, 2012

ఎదురు చూపులు చూడకు! - శారదా అశోకవర్ధన్

నీ కన్నీటికి ఎదుటి వారి మనసు కరిగిపోతుందనుకోకు నీ కష్టాలను చూసి వాళ్ళ గుండె బద్దలయిపోతుందని అపోహపడకు నువ్వు చస్తే ఈ ప్రపంచం ఆగిపోతుందనుకోకు నీ కష్టం నీదే

Jan 13, 2012

ప్రస్తుత ప్రస్థావన! - శారదా అశోకవర్ధన్

పోరా దండుకు పోరా ముందుకు పోరా తోసుకు వడివడిగా దోచుకుపోరా దాటుకుపోరా దూసుకుపోరా తోసుకుపోరా పోరా పోరా వేగంగా! దాడులు చేసి దోపిడి చేసి

Jan 13, 2012

చెదిరిపోతూన్న దృశ్యం - శారదా అశోకవర్ధన్

మామ్మకి తాతయ్యంటే పంచదార చిలకలన్నా ప్రాణం తాతయ్యకి మామ్మంటే పండు మిరపకాయ పచ్చడి కన్నా పరమ ఇష్టం గతాన్ని కనీసం రోజుకు ఒకమారైనా తల్చుకుంటా

Jan 13, 2012

ఒంటరితనం - శారదా అశోకవర్ధన్

ఒంటరితనాన్ని ఒక్కక్షణమైనా భరించలేను తుంటరుల మధ్య అంతకన్నా మనగలుగుతాను ఒంటరి రాక్షసి మనస్సుని గాలమేసి పట్టేసి పిచ్చిపిచ్చి జ్ఞాపకాల ఊబిలోకి లాగేస్తుంది నా నీడని చూసి నేనే భయపడేట్లు భ్రమింపజేస్తుంది

Jan 13, 2012

త్రిసూత్రం - శారదా అశోకవర్ధన్

ఎన్ని బాధలు ఎన్ని గాధలు తలుచుకుంటే గుండె గాయం తలవకుంటే లేదు మార్గం కాలచక్రం కదిపి చూస్తే కలికి కధలను తరచి చూస్తే కతలు ఎన్నో వెతలు ఎన్నో కన్నీటి చారల పొరలు ఎన్నో!

Jan 13, 2012

కృష్ణాతరంగాలు - శారదా అశోకవర్ధన్

పంచె గూడకట్టు,పైన అంగీ, మెడపైన ఒకతుండు,ముచ్చటగనుండు వెండితీగల జుట్టు గాలి కెగురుచునుండు అతడే కృష్ణశాస్త్రి అమరకం! పంచె ఖద్దరు అంచు ధగధగా మెరియ పైన తెల్ల లాల్చి నిగనిగలాడ

Jan 13, 2012

స్వాతంత్ర్యం ఒకరివ్వాలా? - శారదా అశోకవర్ధన్

నాకు స్వాతంత్ర్యం కావాలని అరుస్తే సరిపోతుందా ఎవరి నడుగుతున్నావమ్మా? ఎవరు ఇచ్చేవాళ్ళు? నీ బతుకుకి నువ్వే నాయకురాలివి నీ విజ్ఞతతో నీ మేధతో నీకు నువ్వే నీ జీవితాన్ని నడిపించుకోవాలి

Jan 13, 2012

మహిళా! ఓ మహిళా! - శారదా అశోకవర్దన్

మహిళా! ఓ మహిళా! నువ్వు లేనిదే మహి ఎక్కడుంది? భూమి లేని చోట ఆకాశం వుంటుందా? ఆకాశమే లేకపోతే చుక్కలు రెక్కలు విప్పుకుని మొలుస్తాయా? సృష్టికి ప్రతి సృష్టి చేసే శిల్పి మహిళ

Jan 12, 2012

నాకళ్ళు! - శారదా అశోకవర్ధన్

అన్నార్తుల ఆకలి మంటలు చూడలేక ఆర్తితో అలమటిస్తున్నాయి నా కళ్ళు అబలల మానభంగాలను చూసి అంధుల చీకటి బతుకుల నాదుకోలేక అలమటించిపోతున్నాయి నా కళ్ళు

Jan 12, 2012

తిమింగలం - శారదా అశోకవర్దన్

మట్టి ప్రమిదలో నూనెపోసి చుట్టూ దీపాలు వెలిగించకపోయినా ఫరవాలేదు విద్యుత్ దీపాలు తోరణాల్లా వెలిగించి వినోదాలు చేసుకోకపోయినా నష్టం లేదు మనసు నిండా మమతా దీపాలు వెలిగించుకుంటే చాలు చీకటి ఊహలు ఛిద్రమైపోతాయి

Jan 12, 2012