Facebook Twitter
'ఆమె' - బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి

'ఆమె'


- బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి

 

కవితలల్లాను

కన్నీళ్ళమీద!

అవి, మానవ జీవితాల్లో మొలిచి

హృదయంలో పూచిన గడ్డిపూలు!

 

'అమ్మ' అంటే నీకు అర్థం కాలేదా?

అయితే విను-

ఆమె హృదయం మీదతలనాన్చి

ఆమె చేతుల ఊయెలలో ఊగేప్పుడు

ఆమె కనుపాపల్లోకి చూడు!

 

అంగలూ పంగలుగా

అన్నిమెట్లూ ఎక్కుతానా...

గుమ్మంతెర తొలగించగానే

ఆమె ప్రకృతియై ఎదురోస్తుంది!

 

అమ్మలాగ ఆమె నన్ను

అక్కువ చేర్చుకుంది

'అమ్మా' అనబోయి

'ప్రియా' అంటాను!

 

పెడుతూ వీడ్కోలవుతూ ఆమె

చేలాంచలం చేయి ఊపుతుంది-

హృదయం

పంచబాణా ఘాతం అవుతుంది!

 

సశేషం