ప్రేమిస్తూనే వుంటాను - టి.జగన్మోహన్
posted on Jan 9, 2012
ప్రేమిస్తూనే వుంటాను
టి. జగన్మోహన్
నీవున్నప్పుడు నీతో జంటగా,
నీవు లేక ఇప్పుడు ఏకాంతంలో ఒంటరిగా
ఒకప్పుడు నీ కళ్ళలో నన్ను నేను
ఇప్పుడు నా కలల్లో నీ రూపాన్ని వెదుక్కుంటున్నాను.
నేను మౌనంగా ఉంటున్నా, హృదయం మాత్రం
నీ నామ స్మరణే చేస్తుంది
నీతో గడిపిన క్షణాలు మధురమైనవి నాడు
ప్రతి క్షణం నాగుండెను చీల్చే అగ్నిక్షణం నేడు
నేను ఎన్ని ఆలోచిస్తున్నా చివరి.
ఆలోచనలో నీవే నిండి ఉంటావు
నిన్ను ప్రేమించడమే ఈ స్థితికి
కారణమైతే ఇంకా ప్రేమిస్తూనే వుంటాను.