ఒంటరితనం ఒక అద్భుతవరం
posted on Jan 18, 2015
ఒంటరితనం ఒక అద్భుతవరం
భవ బంధాలు తెంచి
భగవంతుని చేరే
సంధికాలమే ఒంటరితనం
నిజంగా
ఒంటరితనం ఒక అద్భుతవరం
శరత్‌పున్నమినాడు
చందమామ నేస్తమైతే
ఆమని కోకిల పాట
నిద్రలో ముంచేస్తే
బంధువులతో పనియేమి?
బంధాలతో చిక్కేమి?
అందుకే మరి
ఒంటరితనం ఒక అద్భుతవరం
పలకరించేవారు లేకపోతే
మన పలుకు పలుకుకు దైవంతోడైతే
మౌనవ్రతానికి కాలం అనువైతే
ఒంటరితనం ఒక అద్భుతవరం
- ఆరుట్ల శ్రీదేవి
సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో