కావాలి
posted on Dec 28, 2013
కావాలి
- డా. రాధాశ్రీ
ధీరులు కావాలి...ధర్మవీరులు కావాలి
దేశమాత కన్నీరు తుడిచే ఉదాత్త హృదయులు కావాలి
నూత్న వినూత్న విచిత్ర రూపాలలో
నికృష్టులు, భ్రష్టులు అయిన
అంభీరులు జయచంద్రులు మరలా మరలా ఉద్భవించి
పచ్చని దేశాన్ని పాపపంకిలం చేస్తున్నారు
అందుకే ప్రళయ కాలకాలుని మరపించే
అరిభయంకరులు,ఆది శంకరులు
పురుషోత్తమలు, పృధ్వీరాజులు కావాలి నేడు!
కాని...
మునుపటిలా ధర్మం పరాజయం పొందకూడదు
ధర్మ చ్యుతి జరగకూడదు
దుష్ట పద్మవ్యూహాలు భేదించి
"జనని జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరియసి "
అన్న భావమే జీవంగా భావించే
మహోన్నత మహిమాన్విత జీవులు కావాలి.