posted on Dec 2, 2013
చుక్క పొద్దున్న లేచి
- వి. బ్రహ్మానందచారి
చుక్క పొద్దున్న లేచి
మాలక్ష్మీకీ మొక్కి
తులసి పూజలు చేసి
చుట్టూర తిరుగుతూ
కలుములా రాణివై
కదిలింతనె చాలు
కనకవర్షము కురిసె
కలతలన్నీ తీరు
చిరునగవు దివ్వెలూ
బ్రతుకంత వెలిగించి
కరిగిపోతివే నీవు
నా.... జాబిలమ్మ