posted on Nov 21, 2013
తెల్ల వారంగానె
- బ్రహానంద చారి
తెల్ల వారంగానె
పల్లె లేవంగానే
నీ కండ్ల సుడాల
నీలాల మురిపాలు
కొంగు నడుముకు జుట్టి
పొంగునదిమీ పట్టి
తొలి సందె పొద్దుల్లొ
సెలిసోకు సుడాల
పగలంతా నీ కులుకె
కండ్లల్లొ మెదలంగ
పొలికేక బెడితినె
నా.... జాబిలమ్మ