posted on Oct 10, 2013
తొలి కోడి జామునే
- వి.బ్రహ్మానంద చారి
తొలి కోడి జామునే
పనులు నిను లేపంగా
లేచి లేచీ నడువ
లేత నడుముగంగ
వయ్యారి వాల్జెడ
నాగుబామై ఎగసె
ముంగిటా ముత్యాల
రంగ వల్లులు వెలసె
తిలకించు నా కనుల
సిరివెన్నెలలు విరిసె
పులకించి పాడనా
ఓ......జాబిలమ్మ