ఆకాశమంటే అవనికి ప్రేమ

ఆకాశమంటే అవనికి ప్రేమ

- డా. సి.భవానీదేవి

ఆకాశమంటే అవనికి ప్రేమ
అంతులేని నిర్మలందనిస్తుందని

సుర్యోదయమంటే చెట్లకు
మారాకు అతికిస్తుందని

హరివిల్లంటే పిల్లలకు
ఆశల ఉయ్యాలలూగిస్తుంటుందని

మబ్బులంటే మట్టికి
జీవనాంకురాల్ని మొలకెత్తిస్తాయని

నదులంటే సముద్రుడికి
నిలవలేని దూరాలు దాటివస్తాయని

అరణ్యాలంటే కొండలకి
వేళ్ళతో వెన్నుపూసలౌతాయని

వెన్నలంటే కొండలకి
నిలువెల్ల వెలుగు హత్తిస్తుందని

కవిత్వమంటే అక్షరాలను
నిలబెట్టి అస్తిత్వాన్నిస్తుందని!