పరువంపు మేడలో

పరువంపు మేడలో

వి.బ్రహ్మానంద చారి

పరువంపు మేడలో
పుట్టవూ రాణివై
పేరంటమునకేగ
పౌష్యలక్ష్మీవోలె

నీ తల్లి నిను జూసి
ఆనంద భాష్పాల
అక్షింతలను చల్లి
చల్లగా నుండుమనె

ముత్తైదువుల నుదుట
మెరిసేటి కుంకుమే
మంగళారతి జ్యోతి
ఓ......జాబిలమ్మ