ఆమె ముందు

ఆమె ముందు

డా.వై. రామకృష్ణారావు

ఆమె ముందు
మోకరిల్లాను
పిల్లాడు వీపెక్కి
ఛల్ ఛల్ గుర్రం ఆడాడు

ఎడబట్లా కన్నీళ్లు
కలయికల కలువలూ
ప్లాట్ ఫారం అంటే
ఇదే!

విగ్రహం జాగ్రత!
పంచాంగాన్నీ
సప్తమి తత్పురుషం చేస్తే
ప్రమాదం.