posted on Jan 11, 2012
ఎవరు నీవు?
కల్లూరి శైలబాల
నా ప్రియాతి ప్రియ మిత్రమా
ఏ దిగంతాలలోనో మెరిసేటి తారకా
నీవెపుడు మిణుకుమిణుకుమంటూ మారుతూ వుంటావు
కానీ
నిశ్శబ్దంగా నిశ్చలంగా వుంటావు
ఎవరు నీవు?
నన్నెపుడు
అర్ధజ్ఞానిగా మిగుల్చుతావు
అజ్ఞానిగా నిరూపిస్తావు.