posted on Jul 25, 2013
నుదుటి అరుణిమ గాంచి
వి. బ్రహ్మనందచారి
నుదుటి అరుణిమ గాంచి
తొలిపొద్దె యనుకుంటి
మొలకనవ్వుల జూచి
సిరివెన్నెలనుకుంటి
తలపులందున రూపు
కన్పట్టినంతనే
కనులు వేయిగ జేసి
వెతుకాడు తుంటినే
మొయిలు మాటున దాగి
నా మెరుపులమ్మ
మరులు గొల్పగ రావె
నా.... జాబిలమ్మ