ఆక్షణం
posted on Jun 14, 2013
ఆక్షణం
ఆక్షణం...
పుడమిపై ఓ క్రొత్త జీవి పురిటి కందై పుట్టు
పుడమి మీద బ్రతుకుతున్న మరో జీవి గిట్టు
ఆక్షణం...
ఒకని బ్రతుకులో ఆనందానికి ఆయువు పట్టు
మరోకని జీవన గమనానికి గొడ్డలి పెట్టు
ఆక్షణం...
సమాజంలోఒకడు అత్యున్నత స్థాయికి మెట్టు
సమాజం మరొకణ్ణి అధః పాతాళానికి నెట్టు
ఆక్షణం...
అనంత 'కాల' సముద్రంలో ఒక నీటి బొట్టు
అనంత స్వరూపుని చేతిలో ఓ పని ముట్టు
ఆచార్య ఫణీంద్ర