posted on May 30, 2013
చెలీ
జోరుగా వీస్తున్న
హోరుగాలి తాకిడికి
ముఖం పై ముంగురులే
ముసిరినప్పుడు
మునివేళ్ళతో సవరించుకొన
విసిగినప్పుడు
ముడుచుకొన్న నీ కను బొమ్మల
నడుమ నున్న ఆ తిలకమునై
ఒక నిమిషమున్న చాలునే !
చెలీ !
ఇక అనిమిష లోకమేలేనే ?
రచన - ఆచార్య ఫణీంద్ర